సాలిడ్ స్టార్ట్ తో నాగచైతన్య డిజిటల్ డెబ్యూ.!

అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై సినిమాలతో పాటుగా తాను ఓటిటి వరల్డ్ లోకి కూడా ఎంటర్ అయ్యిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ “దూత” తో అయితే చైతు ఈరోజు డిజిటల్ డెబ్యూ ఇవ్వగా దీనికి ఓటిటి వీక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది.

దీనితో చైతు స్టార్ట్ చేసిన తన డిజిటల్ డెబ్యూ మాత్రం ఓ సాలిడ్ స్టార్ట్ ని అందుకుంది అని చెప్పాలి. ఓటిటి ఆడియెన్స్ నుంచి ఆల్ మోస్ట్ పాజిటివ్ టాక్ తోనే ఈ సిరీస్ కి నమోదు అవ్వడం విశేషం. ఇక ఈ సిరీస్ లో ప్రియా భవాని శంకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా శరత్ మరార్ నిర్మాణం వహించారు. అలాగే పాన్ ఇండియా భాషల్లో ఈ సిరీస్ ఈరోజు నుంచి ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి వచ్చింది. మరి ఈ వీకెండ్ కి మంచి సిరీస్ ని చూడాలి అనుకునేవారు ఈ సిరీస్ ని ట్రై చేయవచ్చు. ఒకసారి దీని రివ్యూ చదవండి.

‘దూత’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version