‘గుంటూరు కారం’ : సెకండ్ సాంగ్ పై థమన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్


సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. దీనిని హారికా హాసిని క్రియేషన్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సునీల్, బ్రహ్మానందం, రఘుబాబు, జయరాం వంటి వారు కీలక పాత్రలు చేస్తున్నారు.

విషయం ఏమిటంటే ఇటీవల గుంటూరు కారం నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ ని సొంతం చేసుకుని తాజాగా యూట్యూబ్ లో 30 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ సంస్థ అయిన ఆదిత్య మ్యూజిక్ వారు పెట్టిన ట్విట్టర్ పోస్ట్ ని రీ ట్వీట్ చేసిన థమన్, నెక్స్ట్ సాంగ్ స్వీట్ స్పైస్ మాదిరిగా ఇన్స్టెంట్ గా మరింత అదిరిపోనుందని పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ అవుతుండగా అతి త్వరలో గుంటూరు కారం నుండి సెకండ్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది.

Exit mobile version