“బాయ్స్ హాస్టల్” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

గుల్ మోహర్ ఫిల్మ్స్, వరుణ్ స్టూడియోస్ బ్యానర్ల పై ప్రజ్వల్ బీపీ, వరుణ్ కుమార్ గౌడ, నితిన్ కృష్ణమూర్తి, అరవింద్ ఎస్. కశ్యప్ కు నిర్మించిన చిత్రం బాయ్స్ హాస్టల్. ఈ చిత్రం తెలుగు లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ తెలుగు లో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకి ప్రసారం కానుంది. రిశబ్ శెట్టి, పవన్ కుమార్, తరుణ్ భాస్కర్, రష్మీ తదితరులు గెస్ట్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version