టీవీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకున్న “మ్యాడ్”


సంగీత శోభన్, నర్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతికా సనిల్ కుమార్, గోపికా ఉదయన్ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ రచన, దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది.

ఈ చిత్రం ఇప్పుడు టీవీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ తెలుగు ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. త్వరలో ఈ సినిమా ఈటీవీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Exit mobile version