“ధూత” సిరీస్ పై అజయ్ భూపతి కామెంట్స్!


అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విక్రమ్ కే. కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన వెబ్ సిరీస్ దూత. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటిటి ఛానెల్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లో భారతీయ ప్రధాన బాషల్లో ప్రసారం అవుతుంది. ఈ సిరీస్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సిరీస్ ను చూసిన పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా మంగళవారం సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి సిరీస్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దూత సిరీస్ ను చూసాను, నాగ చైతన్య తన పాత్రలో చాలా అద్బుతం గా ఉన్నారు. డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ చివరి వరకు థ్రిల్ మూడ్ ను మెయింటైన్ చేసిన విధానం చాలా ఆకట్టుకుంది అని అన్నారు. అంతేకాక టెక్నికల్ టీం పై కూడా ప్రశంసల వర్షం కురిపించారు.

Exit mobile version