యూఎస్ లో “హాయ్ నాన్న” లేటెస్ట్ వసూళ్లు.!

నాచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా చిత్రం “హాయ్ నాన్న” కోసం తెలిసిందే. మరి నిన్న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ ని కూడా తెచ్చుకొని థియేటర్స్ లో డీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. ఇక యూఎస్ మార్కెట్ లో మాత్రం నాని తన మార్క్ హవా కంటిన్యూ చేస్తున్నాడు.

ప్రీమియర్స్ తోనే మంచి నెంబర్ సెట్ చేసిన నాని ఇప్పుడు డే 1 కి ఈ మార్క్ ని దాటి 4 లక్షల 50 వేల డాలర్స్ కి పైగా రాబట్టి సూపర్ స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది. మరి డే కంప్లీట్ అయ్యేసరికి ఈజీగా ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్క్ ని అయితే క్రాస్ చేసేస్తుంది అని చెప్పడంలో డౌట్ లేదు. ఇక ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version