సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా చార్ట్ బస్టర్ గా నిలవగా నిన్న ఈమూవీ నుండి ఓ మై బేబీ అనే పల్లవితో సాగె మెలోడీ ని రిలీజ్ చేసారు.
అయితే మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్న ఈ సాంగ్ పై పలువురు మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండగా తాజాగా వాటిపై తన ట్విట్టర్ ద్వారా స్పందించారు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి. ఈ సోషల్ మీడియాలో కొందరు హద్దులు దాటి మాట్లాడుతున్నారని, వీటిపై ఎవరో ఒకరు స్పందించాల్సిందే అంటూ ట్వీట్ చేసిన రామజోగయ్య అనంతరం మరొక ట్వీట్ చేస్తూ ఫైర్ అయ్యారు.
ప్రతివాడు మాట్లాడేవాడే రాయి విసిరే వాడే అన్నారు. అభిప్రాయం చెప్పేదానికి ఒక పధ్ధతి ఉంటుంది పాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని, మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా. అదే లేకపోతే ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం, తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి అంటూ ఆయన పోస్ట్ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గుంటూరు కారం మూవీ జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది.
ప్రతివాడు మాట్లాడేవాడే
రాయి విసిరే వాడే
అభిప్రాయం చెప్పేదానికి ఒక పధ్ధతి ఉంటుందిపాట నిడివి తప్ప నిన్నటి పాటకు ఏం తక్కువయ్యిందని
మీకన్నా ఎక్కువ ప్రేమే మాక్కూడా..అదే
లేకపోతే..ప్రేమించకపోతే మా పని మేం గొప్పగా చెయ్యలేం ..తెలుసుకొని ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడండి— RamajogaiahSastry (@ramjowrites) December 14, 2023