బుల్లితెర పై మరోసారి “పుష్ప ది రైజ్” కి సాలిడ్ రెస్పాన్స్!


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప ది రైజ్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కి వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ లభించింది. ఈ చిత్రం రీసెంట్ గా స్టార్ మా లో మరోసారి ప్రసారం అయ్యింది. ఈ చిత్రం సాలిడ్ టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది.

ఈ చిత్రం కి 6.87 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. పుష్పరాజ్ హవా బుల్లితెర పై ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రం కి సంబందించిన సీక్వెల్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, ఫాహద్ ఫజిల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version