సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడం తో ఆడియెన్స్ లో, ఫ్యాన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ను జనవరి 12, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ చిత్రం యొక్క కర్ణాటక థియేట్రికల్ రైట్స్ ను స్వాగత్ ఎంటర్ ప్రైసెస్ సొంతం చేసుకుంది. కర్ణాటక లో ఈ చిత్రం పలు చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. గుంటూరు కారం కర్ణాటక లో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం లో శ్రీ లీల, మీనాక్షి చౌదరి లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.