డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిన “ఆదికేశవ”

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో, యంగ్ బ్యూటీ శ్రీ లీల లేడీ లీడ్ రోల్ లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఆదికేశవ. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. అయితే ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా మరోసారి ఆడియెన్స్ ముందుకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 22, 2023 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించిన ఆదికేశవలో జోజు జార్జ్, అపర్ణా దాస్, సదా, సుమన్, రాధికా శరత్‌కుమార్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించడం జరిగింది.

Exit mobile version