ప్రత్యేక ఇంటర్వ్యూ : నితిన్ – ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ఇష్క్ కన్నా ఎక్కువ కామెడీ, రొమాన్స్ ఉంటుంది

Nithin
యంగ్ హీరో నితిన్ ఈ శుక్రవారం ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హిట్ సినిమా ‘ఇష్క్’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ తెలిసిన నితిన్ మాతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. అతను తన అనుభవాలను, అలవాట్లను, తన ఫ్యూచర్ ప్లాన్స్ ని మాతో పంచుకున్నారు. నిత్యా మీనన్ మీకు లక్కీ నా అని అడిగితే? నితిన్ చాలా బాగా సమాధానం ఇచ్చారు. నితిన్ ఏం చెప్పారు, మిగతా వివరాలు మీ కోసం అందిస్తున్నాం…

ప్రశ్న) ‘ఇష్క్’ సినిమా తర్వాత వస్తున్న సినిమా ‘గుండెజారి గల్లంతయ్యిందే’. ఈ సినిమా పై ఉన్న అంచనాలాను చూసి ఏమన్నా భయపడుతున్నారా?

స) ఖచ్చితంగా కొంత భయం అయితే ఉంది ఎందుకంటే నా కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచినా ‘ఇష్క్’ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడం వల్ల ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చాలా కీలకమైనది. ప్రేక్షకులు అందించిన అభిమానం చూసాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని నిరుత్సాహపరచను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.

ప్రశ్న) ఈ సినిమా కోసం మీరు తీసుకున్న స్పెషల్ కేర్ ఏంటి?

స) ఈ సినిమాలో ఎక్కువగా కామెడీ ఉంటుంది అది కూడా చాలా ఫ్రెష్ గా ఉంది. పాత్రల మధ్య వచ్చే కామెడీని చాలా బాగా రాసుకున్నాం. నేను కూడా సినిమాలో రొటీన్ గా కాకుండా కొత్తగా కనపడతాను. అలాగే డైలాగ్స్, పాత్రల మధ్య వచ్చే సందర్భాలు బాగా నవ్వు తెప్పిస్తాయి. ఎంతో కూల్ గా సాగిపోయే రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇష్క్ తో పోల్చుకుంటే ‘గుండెజారి గల్లంతయ్యిందే’ లో ఎక్కువ కామెడీ, ఎక్కువ రొమాన్స్ ఉంటుంది.

ప్రశ్న) గుండెజారి గల్లంతయ్యిందే సినిమా ఎలా ఓకే అయ్యింది?

స) ‘ఇష్క్’ కంటే ముందు ఈ సినిమా స్టొరీని విన్నాను. నాకు బాగా నచ్చింది, ఈ మూవీ లోని మెయిన్ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఇలాంటి లవ్ స్టొరీ ని ఇదివరకూ ఎవ్వరూ తీయడానికి ప్రయత్నించలేదు, ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అనుకున్న కాన్సెప్ట్ ని పర్ఫెక్ట్ గా తయారు చేసుకోవడానికి 8 -9 నెలల టైం తీసుకున్నాం. డైలాగ్ రైటర్ హర్ష, మరి కొంతమందితో కలిసి పూర్తిగా డెవలప్ చేసాము. అంతా పూర్తయిన తర్వాత కొంతమందికి ఈ స్టొరీని వినిపిస్తే అందరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడంతో మేము చాలా హ్యాపీ అయ్యాము. నిత్యా మీనన్ కూడా స్క్రిప్ట్ వినగానే ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా సినిమాకి ఓకే చెప్పింది. ఇలా చాలా మంది నుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ నాకు సినిమాపై చాలా నమ్మకాన్ని ఇచ్చింది.

ప్రశ్న) మీకు నిత్యా మీనన్ లక్కీ నా?

స) (నవ్వుతూ) మీరు అలా చెప్పొచ్చు. కారణం ఏదైనప్పటికీ మా ఇద్దరి కాంబినేషన్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. అలాగే నాకు చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీసు వద్ద బిగ్ హిట్ వచ్చింది. కాబట్టి తను లక్కీ అని చెప్పుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ‘ఇష్క్’ సినిమాలో ఉందికదా అనే సెంటిమెంట్ తో ఈ సినిమాకి ఎంచుకోలేదు. ఈ సినిమాలో రొమాంటిక్ ట్రాక్ కాస్త ఎక్కువ ఉంటుంది ఆ పాత్రకి నాచురల్ టాలెంట్ ఉన్న నటి కావాలి. అందుకోసం ఇప్పుడు ఉన్న చాలా మంది హీరోయిన్స్ ని చూసాం చివరికి నిత్యా మీనన్ ని ఎంపిక చేసుకున్నాం. నిత్యా మీనన్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది, అలా చెబితేనే ఒక రొమాంటిక్ సినిమాలోని ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా తెరపై చూపించగలం.

ప్రశ్న) ఇషా తల్వార్ గురించి ఏం చెబుతారు?

స) గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో ఇషా తల్వార్ ది చాలా కీలకమైన పాత్ర. మేము ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరా అని ప్రేక్షకులకి ఆసక్తిని కలిగించాలనుకున్నాం? అందుకోసం ఎవరన్నా ఫ్రెష్ హీరోయిన్ ని తీసుకోవాలనుకున్నాం. ‘వీడు ఎవరిని చేసుకుంటాడు? అనే ఒక ఫీలింగ్ ఉండాలి’ .. అదే ఫీల్ ని ఇషా తల్వార్ ని చాలా బాగా మైంటైన్ చేసింది, అలాగే ఆమె మంచి డాన్సర్.

ప్రశ్న) మీరు ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనంతో కనపడుతున్నారు. గుండెజారి గల్లంతయ్యిందే లో ఏం ట్రై చేసారు?

స) నటుడిగా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ట్రై చెయ్యడాన్ని నేను ఇష్టపడతాను. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ లో ఫుల్ లెంగ్త్ కామెడీ ట్రై చేసాను. నేను ఇప్పటి వరకూ కామెడీ చేసాను కానీ ఇలా ఒక ఫుల్ రోల్ ట్రై చెయ్యలేదు. కొన్ని సీన్స్ లో ఫుల్ గా తాగినట్టు కనిపిస్తాను. తాగినట్టు నటించి ప్రేక్షకులని నవ్వించడం అనేది కష్టమైన పని. ఆ సీన్స్ కోసం నేను చాలా రిహార్సల్స్ చేసి చేసాను బాగా వచ్చాయని అనుకుంటున్నాను. ఇంతకూ ముందు చెప్పినట్టు ఈ సినిమాలో కామెడీ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫ్రెష్ గా కూడా ఉంటుంది.

ప్రశ్న) డైరెక్టర్ వర్క్ కి మీరు పూర్తిగా సంతృప్తి చెందారా?

స) విజయ్ కుమార్ కొండ సినిమాల పట్ల ఎంతో క్రేజ్ ఉన్న డైరెక్టర్, అలాగే ఎంతో కష్టపడి పనిచేస్తారు. ఇది మొదటి సినిమా కాబట్టి ఆ ఫైర్ అతనిలో ఉంది. అయితే ఆ ఫైర్ తో తన సెకండ్ సినిమాకి వర్క్ చేస్తాడో లేదో నాకు తెలియదు(నవ్వుతూ). గత కొన్ని వారాలుగా అతను చాలా తక్కువగా నిద్ర పోతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అతనే దగ్గరుండి చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. అతని వర్క్ విషయంలో నేను చాలా హ్యాపీ.

ప్రశ్న) ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. మీరు కూడా చేస్తారా?

స) అవును చేస్తాను. నాకు మల్టీ స్టారర్ సినిమాలు చేయాలంటే చాలా ఇష్టం. కానీ ప్రస్తుతానికి అలాంటి ఆఫర్స్ ఏమీ ఇంకా రాలేదు. మంచి స్క్రిప్ట్స్ వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను.

ప్రశ్న) మీరు చేయాలనుకున్న డ్రీం రోల్స్ ఏమన్నా ఉన్నాయా?

స) ప్రత్యేకించి డ్రీం రోల్స్ అంటూ ఏమీ లేవు. కానీ నన్ను నేను మార్చుకునేసి కొత్తగా చూపించేలాంటి రోల్ చెయ్యాలనుకుంటున్నాను. ‘గజిని ‘ సినిమాలో ఆ పాత్ర కోసం సూర్య పూర్తిగా మారిపోయాడు. ఫిజికల్ గా, మెంటల్ గా నన్ను నేను మార్చుకోగలిగే చాలెంజ్ ఉన్న పాత్ర ఏమన్నా ఉంటే చేద్దామని ఉంది. అలాంటి చాలెంజ్ ఉన్న పాత్రలు చెయ్యడం అంటే నాకు చాలా ఇష్టం.

ప్రశ్న) మీ ఫేవరెట్ హీరోయిన్/ హీరోయిన్స్ ఎవరు?

స) సదా, జెనీలియా, నిత్యా మీనన్, ఇలియానా నాకు బాగా నచ్చిన నా ఫేవరెట్ కో స్టార్స్. వాళ్ళందరూ నాతో కలిసి పని చేసారు. అలాగే వారితో నాకు మంచి రిలేషన్ షిప్ ఉంది.

ప్రశ్న) హీరోలలో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు?

స) నాకు ప్రతి ఒక్కరితోనూ మంచి సత్సంబందాలు ఉన్నాయి. అలాగే యంగ్ హీరోస్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు బాగా ఎక్కువ గా క్లోజ్ గా ఉండే వాళ్ళ పేరు చెప్పమంటే నేను మంచు విష్ణు పేరు చెబుతాను. మేము చాలా క్లోజ్ మరియు కలిసి చాలాపనులు చేస్తుంటాం.

ప్రశ్న) మీరు ప్రస్తుతం చేస్తున్నసినిమాలేమిటి?

స) ప్రస్తుతం నేను ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమా చేస్తున్నాను. ఇది ఒక డిఫరెంట్ స్టొరీ లైన్, ‘ఇలాంటి సినిమా ఇండియన్ సినిమాలో’ ఇది వరకూ రాలేదని చాలా గర్వంగా చెప్పుకోగలను. ఇప్పటికే 50% సినిమా కంప్లీట్ అయ్యింది. మరి కొన్ని సినిమాల కథలు వింటున్నాను.

ప్రశ్న) మా పాఠకులకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?

స) గుండెజారి గల్లంతయ్యిందే కామెడీ, రొమాన్స్, మంచి మ్యూజిక్ కలగలిపిన కూల్ సమ్మర్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో రీమిక్స్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ సాంగ్ సినిమాకి మేజర్ హైలైట్ అవుతుంది, సాంగ్ చాలా బాగా వచ్చింది. సినిమా చాలా ఫ్రెష్ ఫీల్ ని కలుగ జేస్తుంది చూసి ఎంజాయ్ చెయ్యండి.

అంతటితో నితిన్ తో మా ఇంటర్వ్యూ ముగిసింది. నితిన్ తో మేము చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకు కూడా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను.

ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

Exit mobile version