జైల్లోకి “బిగ్ బాస్ 7” విన్నర్ పల్లవి ప్రశాంత్.!

తెలుగు బుల్లి తెర దగ్గర సూపర్ హిట్ అయినటువంటి గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా ఏడు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ షో కి విన్నర్ గా కామన్ మ్యాన్ రైతు బిడ్డ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు. దీనితో తన విజయం ఒక సంచలనం గా మారింది. కానీ ఈ విజయం నుంచి తాను తేరుకునే లోపే తన అత్యుత్సాహంతో తన పేరును చెడగొట్టుకోడమే కాకుండా ఇప్పుడు జైలు పాలయ్యాడు.

విన్ అయ్యి బయటకి వచ్చాక తాను పోలీసులు పట్ల కానీ శాంతి భద్రతల విషయంలో చేసిన హంగామా ఇప్పుడు తనని జైలు పాలు చేసింది. తాను పరారీలో ఉన్నాడని పోలీసులు గాలింపులో ఎట్టకేలకు నిన్న పట్టుకోగా ఇప్పుడు అతనిని తన సోదరుని కూడా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం, పై అరెస్ట్ చేస్తున్నామని తెలిపారు.

అలాగే సెలెబ్రిటీ ముసుగులో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. అలాగే జడ్జ్ ఇంట్లో పల్లవి ప్రశాంత్ ని తన సోదరుని ప్రవేశ పెట్టగా వారికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ ని జడ్జి విధించారు. దీనితో పోలీసులు వారిద్దరిని చంచల్ గూడ జైలుకి తరలించారని తెలిసింది. మొత్తానికి అయితే ఇలా పల్లవి ప్రశాంత్ తనంత తానే తన పతనానికి కారణం అయ్యాడని చెప్పక తప్పదు.

Exit mobile version