ఇంకా టాప్ లో ట్రెండ్ అవుతోన్న “దూత”


అక్కినేని నాగ చైతన్య యొక్క తొలి వెబ్ సిరీస్, ధూత ఆకర్షణీయమైన కథ, స్క్రీన్‌ప్లే తో ఆకట్టుకుంటుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిజిటల్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో 8 ఎపిసోడ్ లు కలిగిన ఈ సిరీస్‌ ఇంకా టాప్ లో ట్రెండ్ అవుతోంది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ Ormax మీడియా చార్ట్‌లలో OTT విభాగంలో వరుసగా మూడు వారాల పాటు అగ్రస్థానంలో నిలిచింది.

ధూత చార్ట్‌లలో ట్రెండ్‌ను కొనసాగిస్తున్నందున, అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ధూత లో ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్, పశుపతి, రవీంద్ర విజయ్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై శరత్ మరార్ ఈ సిరీస్‌ని నిర్మించారు.

Exit mobile version