టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న”చంద్రముఖి 2″


పి. వాసు దర్శకత్వం లో ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ హార్రర్ మూవీ చంద్రముఖి 2. ఈ చిత్రం 2005 లో రిలీజైన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా ఆడియెన్స్ ముందుకి వచ్చింది. అయితే ఇది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శన కనబరిచింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ లో డిసెంబర్ 31 వ తేదీన సాయంత్రం 6:00 గంటలకి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version