సలార్ సక్సెస్ జోష్లో ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తన తర్వాతి ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మే నెలలో పూజ చేసి 2025లో ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాను విడుదల చేయొచ్చని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా షూట్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఐతే, ఈ సినిమా తర్వాత ‘వార్ 2’ కి డేట్స్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది. కానీ, మరోపక్క ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాకి కూడా వచ్చే ఏడాది జూన్ నుంచి డేట్స్ ఇస్తాడట.
మొత్తానికి ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా గురించి నిత్యం ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఆ మధ్య ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా నటించబోతుంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. నిజానికి ఈ సినిమాకు సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు. తమ హీరోతో ఆమె సినిమా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఓ పాన్ ఇండియా హీరోయిన్ని తీసుకునే ఛాన్స్ ఉంది.