“మెకానిక్” గా యంగ్ హీరో మణి సాయి తేజ


టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వీరాభిమాని అయినటువంటి యంగ్ హీరో మణి సాయి తేజ మొదటి సినిమా “బ్యాట్ లవర్స్” చిత్రంతో హీరోగా అరంగేట్రం చేయగా నెక్స్ట్ వెంటనే “రుద్రాక్షాపురం” చిత్రంలో హీరోగా నటించే అవకాశం సొంతం చేసుకుని మరింతగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ చిత్రం ఇంకా విడుదల కాకుండానే ముచ్చటగా మూడో చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు ఈ యువ నటుడు.

మరి కృష్ణవంశీ శిష్యుడు ముని సహేకర్ దర్శకత్వంలో మణి సాయి తేజ టైటిల్ పాత్ర పోషించిన “మెకానిక్” త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం కోసం వినోద్ యాజమాన్య సంగీత సారధ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన “నచ్చేశావే పిల్ల నచ్చేశావే” సాంగ్ ఆకట్టుకోగా తన మూడవ చిత్రం “మెకానిక్” తనను నటుడిగా మరో మెట్టు ఎక్కించిందనే కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు.

Exit mobile version