క్రేజీ బజ్ : ‘గుంటూరు కారం’ లో మహేష్ – శ్రీలీల మరొక మాస్ నెంబర్ ?


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సునీల్ తదితరులు నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా తాజాగా రిలీజ్ అయిన కుర్చీ మడతపెట్టి లిరికల్ సాంగ్ లో మహేష్, శ్రీలీల తమ మాస్ డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు.

విషయం ఏమిటంటే, గుంటూరు కారం మూవీలో ఈ సాంగ్ తో పాటు ఇటీవల పలాస మూవీలో పాపులైన నక్కిలీసు గొలుసు రీమిక్స్ వర్షన్ సాంగ్ కూడా ఉందని, అలానే మిర్చి గోడౌన్ లో చిత్రీకరించిన ఈ మాస్ సాంగ్ లో కూడా మహేష్, శ్రీలీల సూపర్ డ్యాన్స్ తో అదరగొట్టారని క్రేజీ బజ్. కాగా ఇది మూవీలో సెకండ్ హాఫ్ లో వస్తుందని అంటున్నారు. అయితే ఈ న్యూస్ పై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద న్యూస్ అని తెలుస్తోంది. గుంటూరు కారం మూవీ జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

Exit mobile version