‘కోటబొమ్మాళి పీఎస్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్


ఇటీవల రిలీజ్ అయిన సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోటబొమ్మాళి పీఎస్ ఆడియన్స్ ను ఆకట్టుకుని థియేటర్స్ లో మంచి విజయం అందుకుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి కలిసి నిర్మించారు.

శ్రీకాంత్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించిన ఈ మూవీని యువ దర్శకుడు తేజ మర్ని తెరకెక్కించారు. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

కాగా ఈ మూవీని ప్రముఖ ఓటిటి మధ్యమ ఆహా వారు జనవరి 11న తమ ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. రంజిన్ రాజ్, మిదున్ ముకుందన్ సంగీతం సమకూర్చిన ఈ మూవీ ఒటిటి ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version