ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై తగ్గిన అంచనాలు..

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర రిలీజ్ కి రాబోతున్న పలు అవైటెడ్ చిత్రాల్లో తమిళ్ సినిమా నుంచి హీరో శివ కార్తికేయన్ నటించిన భారీ విజువల్ ట్రీట్ “అయాలాన్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉంటుంది ఏంటి అనేది ట్రైలర్ తో చాలా వరకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మూవీ లవర్స్ ఈ సినిమా పట్ల మొదటి నుంచి ఆసక్తి కనబరిచారు. కానీ ఈ ట్రైలర్ మాత్రం అంచనాలు అందుకునే లెవెల్లో లేదని చెప్పాలి.

ఇలా చూసిన వెంటనే వావ్ అనిపించే లెవెల్లో అయితే అటు తమిళ ప్రేక్షకులకి కూడా అనిపించలేదు. ఇక కొన్ని విజువల్స్ లో గ్రాఫిక్స్ అయితే సినిమా ఏదో యానిమేటెడ్ మూవీలా అనిపిస్తుంది. దీనితో ఈ సినిమా పై అంచనాలు సన్నగిల్లుతున్నాయి. ఇక ఈ చిత్రానికి ఆర్ రవికుమార్ దర్శకత్వం వహించగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే కె జె ఆర్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version