“కింగ్ ఆఫ్ కొత్త” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అభిలాష్ జోషి దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్ ఆఫ్ కొత్త. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం పేలవ ప్రదర్శన కనబరిచి, బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా మూవీస్ లో ఈ శనివారం సాయంత్రం 6:00 గంటలకి ప్రసారం కానుంది. శబీర్ కల్లరక్కల్, ఐశ్వర్య లక్ష్మీ, నైల ఉష, ప్రసన్న, గోకుల్ సురేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జేక్స్ బెజొయ్, శాన్ రహ్మాన్ లు సంగీతం అందించారు. ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version