స్ట్రాంగ్ బజ్ : ఆ రోజున ఓటిటి లోకి రానున్న అఖిల్ ‘ఏజెంట్’ ?


యువ నటుడు అఖిల్ అక్కినేని ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏజెంట్. ఈ మూవీని సురేందర్ 2 సినిమాస్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర గ్రాండ్ గా నిర్మించగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన ఈ మూవీ గత ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చి ఆశించిన స్థాయి సక్సెస్ సొంతం చేసుకోలేకపోయింది.

అయితే అనంతరం ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి సోనీ లివ్ వారు దీనిని గతేడాది సెప్టెంబర్ 29న తమ ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు తెలిపారు. కాగా కొన్ని అనివార్య కారణాల వలన అప్పటి నుండి ఓటిటి రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఏజెంట్ మూవీ ఎట్టకేలకు రానున్న జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా సోనీ లివ్ లో ప్రదర్శితం కానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ స్ట్రాంగ్ బజ్. అయితే దీని పై వారి నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావాల్సి ఉంది.

Exit mobile version