లేటెస్ట్ క్లిక్ : ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు మార్వలెస్ ఎంట్రీ

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచాయి. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇక నేడు గుంటూరు కారం మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గుంటూరు జిల్లా నంబూరు క్రాస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక కొద్దిసేపటి క్రితం ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు మార్వలెస్ స్టైల్ లో ఎంట్రీ ఇచ్చారు. తన ఫేవరెట్ బ్లూ జీన్స్, బ్లూ చెక్స్ షర్ట్ తో సూపర్ స్టార్ ఎంట్రీ అదిరిపోయింది. ఆయన ఎంట్రీ తో ఒక్కసారిగా ఈవెంట్ ప్రాంగణం మొత్తం కూడా హర్షద్వానాలతో మారుమ్రోగిపోయింది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

Exit mobile version