ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “కోటబొమ్మాళి పిఎస్”

సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో యంగ్ నటీనటులు శివాత్మిక రాజశేఖర్ మరియు రాహుల్ విజయ్ లు నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ డ్రామా “కోటబొమ్మాళి పిఎస్”. మరి ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ చిత్రం “నాయట్టు” కి రీమేక్ గా దర్శకుడు తేజ మార్ని తెరకెక్కించగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రంలో తెలుగులో కూడా సాలిడ్ వసూళ్లు అందుకొని మంచి హిట్ అయ్యింది.

అలాగే వినూత్న ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో అయితే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు కొనుగోలు చేయగా అందులో ఈరోజు నుంచి అయితే ఈ సినిమా వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునేవారు ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ని వీక్షించవచ్చు. ఇక ఈ చిత్రానికి రంజన్ రాజ్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహించారు.

Exit mobile version