“హను మాన్” ఓటీటీ, శాటిలైట్ పార్ట్నర్స్ డీటెయిల్స్.!


యంగ్ అండ్ టాలెంటడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “హను మాన్” కోసం తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ విడుదల అయ్యిన ఈ చిత్రం ఆ అంచనాలు అందుకోవడలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ చిత్రం పైడ్ ప్రీమియర్స్ నుంచే అదరగొట్టగా ఇప్పుడు యూనానిమాస్ గా క్రేజీ టాక్ ని తెచ్చుకోవడం విశేషంగా మారింది.

ఇక ఈ సినిమా ఓటీటీ శాటిలైట్ పార్ట్నర్స్ కి సంబంధించి అఫీషియల్ క్లారిటీ బయటకు వచ్చేసింది. ఈ సినిమా టోటల్ నాన్ థియేట్రికల్ హక్కుల్ని జీ సంస్థ వారే కొనుగోలు చేసుకున్నారు. జీ సంస్థలు జీ తెలుగు, జీ సినిమా ఓటీటీ జీ 5 వారు హను మాన్ హక్కులు సొంతం చేసుకోగా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఈ చిత్రాన్ని వాటిలో అయితే చూడవచ్చు.

హను మాన్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version