మాట నిలబెట్టుకున్న ‘హను మాన్’ టీమ్

యువ నటుడు తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హను మాన్. ఈ మూవీని ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

అయితే ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా హను మాన్ టీమ్ తరపున మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, మూవీకి సంబంధించి అమ్ముడయ్యే ప్రతి టికెట్ డబ్బుల నుండి రూ. 5 ని అయోధ్య లోని రామ మందిరానికి విరాళంగా అందించనున్నట్లు తెలిపారు.

కాగా ఆ మాట నిలబెట్టుకుంటూ ప్రీమియర్స్ ద్వారా లభించిన మొత్తంలో నేడు రూ. 14 లక్షల రూపాయలను అయోధ్య రామ మందిరానికి అందించారు హను మాన్ టీమ్. అలానే మూవీ నడిచే చివరి రోజు వరకు వచ్చిన టికెట్ డబ్బులో నుండి ఇదే విధంగా చివర్లో వారికి అందించడం జరుగుతుందని మేకర్స్ తెలిపారు.

Exit mobile version