సూపర్ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న ’90’s’ వెబ్ సిరీస్

శివాజీ, వాసుకి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వెబ్ సిరీస్ 90’s. ఈ సిరీస్ ని ఆదిత్య హాసన్ తెరకెక్కించగా ఇతర పాత్రల్లో మౌళి, వసంతిక, రోహన్ రాయ్ కీలక పాత్రల్లో కనిపించారు. నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం దీనిని గ్రాండ్ గా నిర్మించారు.

సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన ఈ సిరీస్ ఇటీవల ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఈటివి విన్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి అందరినీ బాగా అలరిస్తోంది. విషయం ఏమిటంటే, తాజాగా ఈ సిరీస్ 120 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని సూపర్ రెస్పాన్స్ తో కొనసాగుతోంది. ఇక 90’s సిరీస్ కి ప్రముఖ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDB)లో 9.6 రేటింగ్ లభించింది.

Exit mobile version