డే 1 కలెక్షన్స్ లో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన ‘గుంటూరు కారం’

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం నిన్న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా కీలక పాత్రల్లో జయరాం, రమ్యకృష్ణ, జగపతి బాబు, సునీల్, ఈశ్వరి రావు, రఘుబాబు నటించారు. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ దీనిని నిర్మించింది.

ఇక నిన్న భారీ స్థాయిలో రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీ డే 1 వరల్డ్ వైడ్ గా రూ. 94 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. కాగా ఇది రీజినల్ సినిమాల్లో డే 1 అత్యధిక కలెక్షన్ రికార్డు అని మేకర్స్ తెలిపారు. ఎస్ థమన్ సంగీతం అందించిన గుంటూరు కారంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ యాక్టింగ్ కి అలానే త్రివిక్రమ్ టేకింగ్ కి అందరి నుండి మంచి పేరు లభిస్తోంది.

Exit mobile version