టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి, ప్రాఫిట్స్ లోకి అడుగు పెట్టింది. లిమిటెడ్ థియేటర్ల లో రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ సాధించడం సెన్సేషన్ అని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో హౌజ్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనం ఇస్తుంది.
ఈ సినిమా కి ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. సినిమాను చూస్తున్న ఆడియెన్స్, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.