టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం శతమానం భవతి. ఈ చిత్రం సరిగ్గా ఏడేళ్ల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రెడీ అయిపోయింది.
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ శతమానం భవతి నెక్స్ట్ పేజీ ను అనౌన్స్ చేశారు. లోడింగ్ సూన్, వచ్చే సంక్రాంతికి కలుద్దాం అంటూ పోస్టర్ లో వెల్లడించారు. ఈ చిత్రం కి సంబందించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.