యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న మాసివ్ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడిప్పుడే ఫైనల్ స్టేజ్ కి వచ్చేస్తుంది. ఇక ఈ క్రమంలో సినిమా బిజినెస్ కి సంబంధించి కూడా డీల్స్ స్టార్ట్ అవుతుండగా ఈ సినిమాపై ఉన్న హైప్ కి తగ్గట్టుగానే గట్టి డీల్స్ వస్తున్నట్టుగా టాక్ ఉంది.
అలా నైజాం హక్కులకు సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. దేవర హక్కుల కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 40 కోట్లకి పైగానే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ భారీ మొత్తానికి డీల్ లాక్ అయ్యినట్టుగా ఇప్పుడు సినీ వర్గాల్లో బజ్ వినిపిస్తుంది. దీనితో ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయెస్ట్ డీల్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా మేకర్స్ ప్రస్తుతానికి ఈ ఏప్రిల్ 5న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.