“దళపతి 69” పై స్ట్రాంగ్ బజ్.!

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా ఇప్పుడు దర్శకుడు వెంకట్ ప్రభుతో భారీ చిత్రం “గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ చేసుకుంటుంది. ఇక ఈ సినిమా తోనే విజయ్ చివరి సినిమా అంటూ అప్పుడు రూమర్స్ వచ్చాయి. కానీ 69వ సినిమా కూడా ఉందని స్ట్రాంగ్ రూమర్స్ తమిళ సినీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి ఈ సినిమా ఎవరితో ఉంటుంది అనే దానిపై ఇపుడు స్ట్రాంగ్ బజ్ ఒకటి బయటకి వచ్చింది.

రీసెంట్ గా భారీ నిర్మాణ సంస్థ డీవీవీ తో ఉంటుంది అని కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ అది నిజం కాదు అని తేలిపోయింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించనున్నాడని టాక్. అంతే కాకుండా ఆల్రెడీ విజయ్ తో భారీ హిట్స్ అందుకున్న నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించనున్నారని దీనిపై అధికారిక క్లారిటీ కూడా రానుంది అని తెలుస్తుంది.

Exit mobile version