వంద కోట్ల క్లబ్ లోకి “ఫైటర్”


బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ , సిద్ధార్ద్ ఆనంద్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఫైటర్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది ఈ సినిమా. ఆదివారం రోజు ఈ సినిమా మరో 30.20 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. దీంతో ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. మొత్తం ఇప్పటి వరకూ ఫైటర్ మూవీ 123.60 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

దీపికా పదుకునే లేడీ లీడ్ రోల్ లో నటించగా, అనీల్ కపూర్ ఇందులో మరొక కీలక పాత్రలో నటించారు. వయాకామ్ 18 స్టూడియోస్ మరియు మర్ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్ లపై నిర్మించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version