శర్వానంద్ హీరోగా 2014లో తెరకెక్కిన రన్ రాజా రన్ మూవీ మంచి సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ద్వారా యంగ్ డైరెక్టర్ సుజీత్ తొలిసారిగా మెగాఫోన్ పట్టారు. ఆ విధంగా ఫస్ట్ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న సుజీత్, అనంతరం 2019లో ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో సాహో మూవీ తీసి మరొక మంచి విజయం అందుకున్నారు. ఇక ప్రస్తుతం తన అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ తో భారీ యాక్షన్ గ్యాంగ్ స్టర్ మూవీ ఓజి తెరకెక్కిస్తున్నారు సుజీత్.
ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగష్టు లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. విషయం ఏమిటంటే, దీని అనంతరం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన నాచురల్ స్టార్ నానితో సుజీత్ తన తదుపరి సినిమాని చేయనున్నట్లు టాలీవుడ్ లేటెస్ట్ బజ్. ఇప్పటికే నాని కోసం మంచి యాక్షన్ గ్యాంగ్ స్టర్ స్టోరీ ని సిద్ధం చేశారట సుజీత్. అలానే ఈ మూవీని ప్రముఖ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించనునారని అంటున్నారు. అతి త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందట.