మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషీ చిల్లార్ హీరోయిన్ గా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఏరియల్ యాక్షన్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఈ మూవీని సోనీ పిక్చర్స్, రెనైసెన్స్ పిక్చర్స్, గాడ్ బ్లెస్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఆపరేషన్ వాలెంటైన్ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ వందేమాతరం అందరినీ ఆకట్టుకోగా నేడు గగనాల అనే పల్లవితో సాగె మెలోడియస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ సాంగ్ ని అర్మాన్ మాలిక్ అద్భుతంగా పాడారు. కాగా ప్రస్తుతం ఈ లిరికల్ సాంగ్ కి యూట్యూబ్ లో మంచి వ్యూస్ లభిస్తున్నాయి. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో మార్చి 1న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.