టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ఈగిల్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. సినిమాకి తొలి షో నుండే పాజిటివ్ టాక్ రావడం తో ఆడియెన్స్ థియేటర్ల వద్ద భారీగా వస్తున్నారు. ఈ మేరకు సక్సెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించారు నేడు. ఈ కార్యక్రమంలో హీరో రవితేజ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చిత్రం కోసం ఎంతో ఎఫర్ట్ పెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ దావ్ జండ్, రైటర్ మణి, హీరోయిన్ కావ్య థాపర్, అవసరాల శ్రీనివాస్, ఇతర నటీనటులను, చిత్త యూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తారు హీరో. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ అవుతారు అంటూ చెప్పుకొచ్చారు. డైరెక్టర్ విజన్ కి, తనను ఒప్పించిన విధానం కి, పాత్ర ను తీర్చి దిద్దిన విధానం, అందుకు ప్రశంసలు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి కంగ్రాట్స్ తెలిపారు. మాస్ మహారాజ రవితేజ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Watch Mass Maharaj@RaviTeja_offl
Superb Speech @ #EAGLE Grand Success Meet ????watch here :https://t.co/TIqptr43mX@Raviteja_offl @Karthik_gatta @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla @KavyaThapar @anupamahere @pnavdeep26 @VinayRai1809 @manibkaranam @RajaS_official… pic.twitter.com/Ed4zxnflas
— People Media Factory (@peoplemediafcy) February 11, 2024