విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు: దీపక్ సరోజ్, తన్వి నేగి, ఆనంద్, కళ్యాణి నటరాజన్, మాథ్యూ వర్గీస్, నందిని, కీర్తన మరియు ఇతరులు
దర్శకుడు: వి. యశస్వి
నిర్మాత: జయ ఆడపాక
సంగీత దర్శకులు: రధన్
సినిమాటోగ్రాఫర్: సామ్ కె నాయుడు
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంబంధిత లింక్స్: ట్రైలర్
బాల నటుడుగా ఎన్నో సినిమాల్లో నటించి ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా యశశ్వి దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ యారొగెంట్ యాక్షన్ డ్రామా “సిద్ధార్థ్ రాయ్”. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ :
ఇక కథ లోకి వస్తే.. సిద్ధార్థ్ రాయ్(దీపక్ సరోజ్) జీవితం అంటే కేవలం తిండి, నిద్ర సాన్నిహిత్యం లాంటివి ఉంటే చాలు అనే భావనతో మాత్రమే ఆలోచన కలిగిన వాడు. మరి ఎమోషనల్ గా ఇలాంటి ఆలోచనలు కలిగిన యువకుడు ఇందుమతి(తన్వి నేగి) పరిచయం అవుతుంది. మరి సిద్ధూ కి కంప్లీట్ భిన్నంగా ఉండే ఈ అమ్మాయితో పరిచయం ఎక్కడ వరకు వెళ్ళింది. ఒకవేళ వీరు విడిపోతే సిద్ధూ ఏం చేస్తాడు? అసలు చివరికి ఏమయ్యింది అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో మంచి రోల్స్ చేసిన దీపక్ ఈ బోల్డ్ చిత్రంలో మాత్రం సాలిడ్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు అని చెప్పాలి. తనలోని ఏపాటి పొటెన్షియల్, నటుడు దాగున్నాడో ఈ చిత్రంలో చూపించాడు. అలాగే దర్శకుడు తనతో ఏం చూపించాలి అనుకున్నాడో దానిని దీపక్ సరోజ్ తన స్టెల్లార్ పెర్ఫామెన్స్ తో చూపించాడు.
ఇక ఫీమేల్ లీడ్ లో కనిపించిన తన్వి నేగి కూడా మంచి పెర్ఫామెన్స్ తో ఇంప్రెస్ చేస్తుందని చెప్పాలి. తన రోల్ లో కావాల్సిన ఎమోషన్స్ ని ఆమె పర్ఫెక్ట్ గా డెలివర్ చేసింది. ఇక వీరితో పాటుగా మిగతా ముఖ్య పాత్రల్లో నటించిన ఇతర నటీనటులు తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి మంచి నటనను కనబరిచారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో బేసిక్ లైన్ బాగానే అనిపిస్తుంది కానీ దీనిని తెరకెక్కించడంలో మాత్రం లోపాలు కనిపిస్తాయి. అయితే రీసెంట్ టైమ్స్ లో ఓ యాటిట్యూడ్ ఉన్న హీరో పాత్ర అంటే ఇలానే ఉండాలి అనే ఫార్మాట్ చెప్పుకుని క్రియేట్ చేసుకున్నట్టు మనం ఆల్రెడీ చూసిన విధంగానే ఈ సినిమాలో కూడా సీన్స్ కనిపిస్తాయి. అయితే ఇవి ఈ చిత్రానికి అనవసరం అనిపిస్తుంది.
అంతే కాకుండా ఈ ఫోర్స్డ్ సీక్వెన్స్ లు ఒకింత ఓవర్ డోస్ లో కూడా అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా మరికొన్ని సీన్స్ అయితే చాలా బోల్డ్ గా కొన్ని వర్గాల ఆడియెన్స్ కి ఇబ్బందిగా అనిపించవచ్చు. అలాగే కొన్ని లాజిక్ లు అయితే ఓవర్ గా అనిపిస్తాయి అలాగే సినిమాలో స్క్రీన్ ప్లే కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించదు.
ఇక ఫైనల్ గా సినిమాలో సాంగ్స్ కానీ వాటి ప్లేస్ మెంట్ లు కానీ బాగా డిజప్పాయింట్ చెయ్యడమే కాకుండా కథనంలో చికాకు తెప్పిస్తాయి.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు. ఇక టెక్నికల్ టీం లో సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ వర్క్ బాగాలేదు. అలాగే ఎడిటింగ్ మాత్రం ఇంకా బాగా చేయాల్సింది. కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించాల్సింది.
ఇక దర్శకుడు యశశ్వి విషయానికి వస్తే.. ఒక్క పాత్రల నుంచి కాస్త సహజ నటనను రాబట్టడంలో ఆకట్టుకున్నాడు తప్ప ఇక మిగతా ఏ అంశంలో కూడా మెప్పించలేదు అని చెప్పాలి. అనవసర హంగులు అద్దడం నిజంగా ఈ చిత్రానికి అనవసరం అనిపిస్తుంది. ఏదో యూత్ ని ఆకట్టుకునేందుకు యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రితింగ్ అనుకునేవాళ్లు కోసం ఫోర్స్డ్ డిజైన్ చేసిన సీక్వెన్స్ లు ఏమాత్రం మెప్పించవు. స్క్రీన్ ప్లే ని నీట్ గా డిజైన్ చేసుకొని ఈ సినిమాని తాను ప్రెజెంట్ చేయాల్సింది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “సిద్ధార్థ్ రాయ్” లో దీపక్ సరోజ్ తన సిన్సియర్ ఎఫర్ట్స్ ని పెట్టాడు. కానీ సినిమాలో అసలు విషయం తేలిపోయింది. ఓవర్ సీన్స్, వీక్ స్క్రీన్ ప్లే సినిమాని ఏమాత్రం ఎంగేజింగ్ గా మలచలేదు. వర్కౌట్ కాని ఎమోషన్స్, కొన్ని అడల్ట్ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా ఇబ్బందిగా అనిపించవచ్చు. వీటితో అయితే ఈ వారాంతానికి ఈ చిత్రాన్ని స్కిప్ చేసేయడమే మంచిది.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team