టాలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయ్యిన పలు భారీ హిట్ చిత్రాల్లో యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం “హను మాన్”. మరి తెలుగు సినిమా నుంచి మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాగా వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు కొల్లగొట్టి అదరగొట్టింది. అయితే ఈ చిత్రం రీసెంట్ గానే ఓటిటిలో (Hanu Man OTT) కూడా విడుదల అయ్యి సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.
ఇక ముందు కొన్ని నెలలు పాటు కూడా హను మాన్ పేరు కొనసాగనుండగా దర్శకుడు ప్రశాంత్ వర్మ అయితే తన మొట్ట మొదటి అవార్డు హను మాన్ సినిమాకి గాను అందుకున్నట్టుగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తనకి ఈ అవార్డు అందించిన రేడియో సిటీ ఇండియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అవార్డు పట్టుకొని ఉన్న తన ఫోటో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇక ఇపుడు తాను తన లేడీ ఓరియెంటెడ్ చిత్రం సహా హను మాన్ పాన్ (Hanu Man Pan World Release) వరల్డ్ రిలీజ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు.
First award for #HanuMan ????
Thank you @radiocityindia ????#IconAwards #BestDirector pic.twitter.com/xCqgCHkoro
— Prasanth Varma (@PrasanthVarma) March 21, 2024