సూపర్ స్టార్ మహేష్ బాబు (SSMB) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం కి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ అందించిన సంగీతం సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఈ చిత్రం లోని పాటలు వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి.
ఈ చిత్రం లోని మావా ఎంతైనా పాటకి స్పైడర్ మ్యాన్ గెటప్ లో ఉన్న ఫ్యాన్స్ అద్దిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ వీడియో ను షేర్ చేశారు. యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో, మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
The world's spinning with MADNESS ????
Never seen anything like it! ????Sarrraaaaa sarraa sulam ???? @urstrulyMahesh #GunturKaaram pic.twitter.com/0E2jhGZ9N4
— Guntur Kaaram (@GunturKaaram) April 19, 2024