సూపర్ స్టార్ రజినీకాంత్ పేట, విజయ్ మాస్టర్ చిత్రాలతో ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకున్న నటి మాళవిక మోహనన్. ప్రస్తుతం విక్రమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తంగలాన్ మూవీ లో నటిస్తుంది. ఈ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నోత్తరాల సెషన్ ను తన అభిమానులతో నిర్వహించింది. తన అభిమానులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలిపింది.
అందులో తన డ్రీమ్ రోల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. గ్యాంగ్‌స్టర్‌గా నటించాలనే కోరికను వ్యక్తం చేసింది. ఒక మహిళ కూల్ గ్యాంగ్‌స్టర్‌గా నటించడం ఆసక్తికరంగా ఉంటుంది అని పేర్కొంది. ఇప్పుడు నేను యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా శిక్షణ పొందాను, ఆ వైపు మరింత అన్వేషించడం సరదాగా ఉంటుంది అని నటి చెప్పింది. అంతేకాక తంగలాన్ రిలీజ్ కోసం అందరిలాగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఉంటుంది అని పేర్కొంది.
మరొక పక్క కి హృతిక్ రోషన్ తనకి కృష్ అని వెల్లడించింది. డ్రామా, రోమాన్స్, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడతా అని, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ లు ఇష్టం ఉండవు అని పేర్కొంది. టాలీవుడ్ లో అనుష్క శెట్టి, సమంత లు తన ఫేవరేట్ అని తెలిపింది. తంగలాన్ తో పాటుగా, ఆమె ప్రస్తుతం తన టాలీవుడ్ అరంగేట్రం ది రాజా సాబ్ షూటింగ్లో బిజీగా ఉంది, ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
I want to play a Gangster ????????
Will be interesting to see a woman play a cool gangster, no? ????
And now that I’m trained in action sequences as well, will be fun to explore that side more https://t.co/J9nJuKjfyb— Malavika Mohanan (@MalavikaM_) April 29, 2024
Love- drama/rom-com/romance/thriller
Dislike- action/sci-fi https://t.co/5ZLK7TqfJd— Malavika Mohanan (@MalavikaM_) April 29, 2024
I was very young with ‘Kaho na pyaar hai’ had come out and had a massive crush on #HrithikRoshan ???????? https://t.co/LVqgZscV8M
— Malavika Mohanan (@MalavikaM_) April 29, 2024
Love Anushka Shetty, Samantha ☺️???????? https://t.co/wRtSjTRTQx
— Malavika Mohanan (@MalavikaM_) April 29, 2024