సమీక్ష : “ప్రతినిధి 2” – రొటీన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా !

Prathinidhi 2 Movie Review in Telugu

విడుదల తేదీ : మే 10, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, ర‌ఘు కారుమంచి త‌దిత‌రులు

దర్శకుడు: మూర్తి దేవగుప్తపు

నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని

సంగీత దర్శకుడు: మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి

ఎడిటింగ్: రవితేజ గిరిజాల

సంబంధిత లింక్స్: ట్రైలర్

నారా రోహిత్ గతంలో చేసిన ‘ప్ర‌తినిధి’ సినిమాకి కొన‌సాగింపుగా రూపొందిన సినిమా ‘ప్ర‌తినిధి2’. మూర్తి దేవ‌గుప్తుపు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

జ‌ర్న‌లిస్ట్ చేత‌న్ (నారా రోహిత్‌) నిజాన్ని నిర్భ‌యంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్ర‌శ్నించే వ్యక్తి. ఎంత కష్టం వచ్చినా న్యాయం కోసం దేనికైనా సిద్ధంగా ఉంటాడు. మరోవైపు ప్రజా శ్రేయస్సు పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడ్కర్) క్యాంప్ ఆఫీస్ పై ఎవరో దుండగులు బాంబు దాడి చేస్తారు. ఆ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోతారు. ముఖ్యమంత్రి ప్రజాపతి మరణం తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటి ?, చనిపోయిన ముఖ్యమంత్రి మళ్లీ ఎలా తిరిగి వచ్చాడు ?, అసలు ముఖ్యమంత్రి నిజంగా చనిపోయాడా ? లేదా ?, చనిపోతే ముఖ్యమంత్రిని చంపాల్సిన అవసరం ఎవరికి వుంది? ఆయనకి వున్న శ‌త్రువులు ఎవరు ? ఈ మొత్తం కథలో ఎన్సీసీ న్యూస్ ఛానల్ సిఈవో చేతన్ (నారా రోహిత్) పాత్ర ఏమిటి ? మిగిలిన కథ ?

ప్లస్ పాయింట్స్ :

ప్రస్తుత రాజకీయాల గురించి, సిస్టమ్ లోని లొసుగులు గురించి ఈ ప్రతినిధి 2 సినిమాలో చర్చించిన అంశాలు బాగున్నాయి. అలాగే రాజకీయ నాయకుల అవినీతి గురించి, అలాగే ఓటర్ల బలహీనతలు, తప్పుల గురించి ఈ చిత్రంలో దర్శకుడు మూర్తి దేవగుప్తపు ప్రస్తావించిన అంశాలు కూడా ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా ఆయన రాసుకున్న పొలిటికల్ సన్నివేశాలు, ముఖ్యమంత్రి ట్రాక్.. నారా రోహిత్ – రాజకీయ నాయకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

ఇక నారా రోహిత్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కీలక పాత్రలో నటించిన హీరోయిన్ సిరీ లెల్ల కూడా చాలా బాగా నటించింది. కథలో ఆమె పాత్రను ఇన్ వాల్వ్ చేయడం బాగుంది. మరో ప్రధాన పాత్రలో కనిపించిన దినేష్ తేజ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించిన సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు మూర్తి దేవగుప్తపు రాజకీయాలకు సంబంధించి మంచి డ్రామా తీసుకున్నా.. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేకపోయారు. ఆయన రాసుకున్న సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బాగా బోర్ గా సాగాయి. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు సాగతీసినట్లు, దానికి తోడు సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నప్పటికీ, దర్శకుడు మూర్తి దేవగుప్తపు మాత్రం ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే దానికన్నా, ఓన్లీ పొలిటికల్ డ్రామానే ఎలివేట్ చెయ్యటానికే ఎక్కువ ఆసక్తి చూపించాడు.

అదే విధంగా నారా రోహిత్ పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా బలంగా ఉంటే బాగుండేది. సినిమాలో ఉన్న బలమైన కాన్ ఫ్లిక్ట్ ఎలివేట్ చేయడంలో విఫలం అయ్యారు. అలాగే కొన్ని చోట్ల ప్లే స్లో అయింది. దీనికి తోడు ఈ సినిమాలో ప్రేక్షకులు స్క్రీన్ ప్లే కి అస్సలు కనెక్ట్ కారు. సెకండ్ హాఫ్ ట్రీట్మెంట్ ను ఇంకా బెటర్ గా రాసుకోవాల్సింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు మూర్తి దేవగుప్తపు సరైన కథా కథనాలను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

ప్రతినిధి 2 అంటూ వచ్చిన ఈ పొలిటికల్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో కొన్ని పొలిటికల్ సీన్స్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ బాగానే ఉన్నాయి. కానీ, నమ్మశక్యం కాని సన్నివేశాలతో, ఇంట్రెస్ట్ కలిగించలేని ప్లేతో అండ్ వర్కౌట్ కాని పొలిటికల్ సీన్స్ వంటి అంశాలు కారణంగా ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. ఐతే పొలిటికల్ జోనర్ లో సినిమాలను ఇష్ట పడే ప్రేక్షకులకు ఈ సినిమాలోని కొన్ని అంశాలు నచ్చుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

REVIEW OVERVIEW
Prathinidhi 2 Movie Review in Telugu
prathinidhi-2-movie-review-in-telugu విడుదల తేదీ : మే 10, 2024 123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5 నటీనటులు: నారా రోహిత్, సిరీ లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, ర‌ఘు కారుమంచి త‌దిత‌రులు దర్శకుడు: మూర్తి దేవగుప్తపు నిర్మాతలు: కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని సంగీత...
Exit mobile version