సూపర్ స్టార్ “కూలీ” సెట్స్ మీదకి వెళ్లేది అప్పుడే?

జైలర్ చిత్రంతో గతేడాది భారీ బ్లాక్ బస్టర్ సాధించిన రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ స్టార్ హీరో నటిస్తున్న వేట్టయాన్ చిత్రం కి సంబందించిన షూటింగ్ ను పూర్తి చేశారు. టిజె జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది. తదుపరి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీ అనే మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ను చేస్తున్నారు రజినీకాంత్. ఈ చిత్రం యొక్క ఎలక్ట్రిఫైయింగ్ అనౌన్స్‌మెంట్ వీడియో ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది.

తాజా సంచలనం ప్రకారం కూలీకి సంబంధించిన షూటింగ్ జూన్ 6, 2024న ప్రారంభం కానుంది. రజనీకాంత్ సెట్స్ లోకి అడుగు పెట్టడానికి ముందు 3 వారాల విరామం తీసుకోబోతున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ చిత్రంలో బలమైన స్త్రీ పాత్రలను కలిగి ఉంటారని వెల్లడించారు. శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుందని, బహుశా రజనీ కూతురిగా కనిపించనుందని నివేదికలు సూచిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version