స్టార్ డైరెక్టర్ మణిరత్నం యొక్క పొన్నియిన్ సెల్వన్ మూవీ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను అబ్బురపరిచిన ఐకానిక్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కొత్త సినిమాలకు సంతకం చేయలేదు. ఏది ఏమైనప్పటికీ, ఆమె కేన్స్ 2024 ఫిల్మ్ ఫెస్టివల్ లో కనిపించనుంది. ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో పాటు, ఐశ్వర్య గత రాత్రి కేన్స్‌కు వెళ్లే మార్గంలో ముంబై విమానాశ్రయంలో కనిపించింది. అయితే ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆమె కుడి చేతికి కట్టుకట్టి ఉంది. చేతికి గాయం అయినట్లు ఆ కట్టు ను చూస్తే తెలుస్తుంది. ఐశ్వర్యరాయ్ వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. ఈ విషయంలో అభిమానులు ఆందోళన చెందారు. తనకు ఏమైంది అనే వివరాలు భవిష్యత్ లో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.