నాని తో ‘ద‌స‌రా’ విలన్ మళ్లీ ?

‘ద‌స‌రా’ కాంబో రిపీట్ కానుంది అని ఇప్పటికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. నాని కోసం శ్రీ‌కాంత్ ఈ సారి కూడా ఓ స‌రికొత్త కథ రాశాడట. దసరా కోసం నానిని ఓ స‌రికొత్త అవ‌తార్‌లో చూపించాడు. అలాగే, దసరాలో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ను కూడా దర్శకుడు శ్రీ‌కాంత్ ఓదెల చాలా కొత్తగా చూపించాడు. టాలీవుడ్ లో షైన్ టామ్ చాకో కి డిమాండ్ పెరగడానికి కూడా దసరా సినిమానే ముఖ్యకారణం.

ఐతే, తాజాగా, శ్రీ‌కాంత్ ఓదెల నానితో చేస్తున్న రెండో సినిమాలో కూడా షైన్ టామ్ చాకో కి ఓ కీలక పాత్ర రాశాడని.. సినిమాలో మెయిన్ విలన్ అతనే అని, కానీ అతని రూపం పూర్తిగా కొత్తగా ఉంటుందని.. గుర్తుపట్టలేని గెటప్ లో షైన్ టామ్ చాకో కనిపిస్తాడని.. షైన్ టామ్ చాకో లుక్‌, మేకొవ‌ర్ ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేస్తాయని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ఈ కథా నేపథ్యం 80వ దశకంలో సాగుతుంది అని, అప్పటి నిజాం పరిపాలనలో సాగిన ఓ పోరాట యోధుడి కథ ఆధారంగా శ్రీ‌కాంత్ ఓదెల స్క్రిప్ట్ రాసుకున్నాడు అని తెలుస్తోంది. అందుకే, నిజ‌మైన నాయ‌కుడికి ఐడెంటిటీ అవ‌స‌రం లేద‌న్న స్లోగ‌న్ ను పోస్ట‌ర్‌పై పెట్టారట. మొత్తానికి ఓ మాస్ లీడ‌ర్ క‌థతో ఈ సారి నాని రాబోతున్నాడు.

Exit mobile version