టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప”. ఈ చిత్రం కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ చిత్రంలో మరో క్రేజీ నటి కూడా కనిపించబోతుంది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ ప్రాజెక్ట్‌లో ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. కన్నప్పను ఇష్టపడే ఓ గిరిజన యువతి పాత్రలో కాజల్ కనిపిస్తోందట.
ఇప్పటికే, కన్నప్ప లో ప్రభాస్, అక్షయ్ కుమార్ మరియు మోహన్ లాల్ కూడా పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా టీజర్‌ను మే 20న సాయంత్రం 6 గంటలకు ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విడుదల చేయనున్నారు. కాగా ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.
ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాకి మహా భారత్ సీరియల్‌ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.