‘దేవర’ రెండో పాట పై క్రేజీ న్యూస్

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘ఫియర్ సాంగ్’ ప్రస్తుతం విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ మొదటి పాట సోషల్ మీడియాతో సహా వరల్డ్ వైడ్ గా మ్యూజిక్ ఛార్ట్స్ ని ప్రస్తుతం రూల్ చేస్తోంది. ఐతే, ఇప్పుడు దేవర రెండో పాట పై ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. దేవర నుంచి రెండో పాటగా ఓ మెలోడీ సాంగ్ రాబోతుందని టాక్. సముద్ర తీరంలో సాగే ఈ సూపర్ కూల్ మెలోడీ సాంగ్ మంచి ఫీల్ తో ఉంటుందని టాక్.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. . అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version