తమిళ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు హిట్ హారర్ కామెడీ సిరీస్ లలో దర్శకుడు సుందర్ సి తెరకెక్కించిన సిరీస్ “అరణ్మణై” సిరీస్ కూడా ఒకటి. మరి ఈ సిరీస్ లో సరికొత్త ఎడిషన్ “అరణ్మణై 4” రిలీజ్ అయ్యి తమిళ నాట మంచి హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రం తెలుగులో “బాక్” గా రిలీజ్ కి రాగా మన దగ్గర పర్వాలేదనిపించింది. మరి ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీస్ తమన్నా, రాశి ఖన్నా లు నటించారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి ఎంట్రీకి సిద్ధం అవుతుంది. మొదట్లో ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రైమ్ వీడియో తీసుకున్నట్టుగా టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు అఫీషియల్ గా డిస్నీ+ హాట్ స్టార్ వారు సినిమా తీసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ సినిమాని అతి త్వరలోనే పాన్ సౌత్ భాషల్లో తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక డేట్ ఎప్పుడు అనేది రివీల్ కావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందించగా సుందర్ సి నే నిర్మాణం వహించారు.