అందాల భామ కాజల్ అగర్వాల్ ఓ బిడ్డకు తల్లి అయినా కూడా తనకు సినిమాలపై ఉన్న ఆసక్తితో వరుసగా సినిమాలు చేస్తోంది. ఆమె నటిస్తున్న లేటెస్ట్ కాప్ థ్రిల్లర్ మూవీ సత్యభామ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో ఆమె సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఆమె మీడియాతో పంచుకుంది.
సత్యభామ మూవీలో మీకు ఏం నచ్చింది..?
ఈ సినిమా నా రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉంది. సినిమాలోని క్యారెక్టర్ లా నేను కూడా సమాజంలో జరిగే ప్రతి విషయంపై స్పందిస్తుంటాను. బయటకు రాకపోయినా, ఆ ఘటనలపై నా అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తపరుస్తుంటాను. ఈ సినిమాలో నేను ఇప్పటివరకు చేయని పాత్ర దక్కింది. ఎమోషనల్ గా ఉంటూనే యాక్షన్ కు పనిచెప్పే క్యారెక్టర్ నాకు దొరికింది. ఈ సినిమాలోని కొన్ని ఎమోషన్స్ ను రియల్ గా ఫీల్ అయ్యాను. అవి మీకు తెరపై రియలిస్టిక్ గా కనిపిస్తాయి.
మీకు ఏ పేరు బాగా నచ్చుతుంది.. చందమామ లేక సత్యభామ..?
నాకు చందమామ అని పిలిచినా నచ్చుతుంది.. సత్యభామ అన్నా కూడా నచ్చుతుంది. రెండు పేర్లు కూడా బాగుంటాయి. చందమామ ఓ చక్కటి పేరు.. సత్యభామ ఓ పవర్ఫుల్ పేరు. రెండింట్లో ఏదైనా ఓకే.
ఈ సినిమా టెక్నికల్ టీమ్ గురించి..?
సుమన్ చిక్కాల ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నా, అనుభవం ఉన్న డైరెక్టర్ లా ఈ సినిమాను హ్యాండిల్ చేశారు. ఆయనకు తన వర్క్ పై చాలా క్లారిటీ ఉంది. ఇక నిర్మాతలు కూడా కొత్తవారు అయినప్పటికీ ఈ సినిమాను ఓ బేబీలా దగ్గరుండి చూసుకున్నారు. అందుకే ఆరమ్ ఆర్ట్స్ అంటే నా హోం బ్యానర అని అన్నాను. శశికిరణ్ మంచి ట్యాలెంట్ ఉన్న డైరెక్టర్. అయితే, ఈ సినిమాను ఆయన ఎందుకు డైరెక్ట్ చేయట్లేదని అడిగా.. దానికి ఆయన ‘మనం ఎప్పుడూ ఒకే పని చేయకూడదు. మిగతా జాబ్స్ ని కూడా ఎక్స్ ప్లోర్ చేయాలని’ చెప్పారు. అది నాకు బాగా నచ్చింది.
పోలీస్ గెటప్ లో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది..?
నేను గతంలో జిల్లా(తమిళ్ మూవీ)లో పోలీస్ గెటప్ లో నటించాను. అయితే అది సీరియస్ పాత్ర కాదు. కానీ, సత్యభామలో మాత్రం పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తాను. మీకు నచ్చుతుందనే అనుకుంటాను.
ఈ సినిమాలో యాక్షన్ ఎలా ఉంటుంది..?
సత్యభామ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ ల కోసం నేను చాలా కష్టపడ్డాను. ఫైట్స్ అన్నీ రియలిస్టిక్ గా ఉంటాయి. రామ్ చరణ్ లా వంద మందిని కొట్టలేను. నా తరహాలో యాక్షన్ సీక్వెన్స్ లను సుబ్బు మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు.
ఈ మూవీలో మ్యూజిక్ ఎలా ఉంటుంది..?
శ్రీచరణ్ పాకాల తనలోని బెస్ట్ పర్ఫార్మెన్స్ ను అందించారు. సినిమాలో వచ్చే పాటలు, బీజీఎం తప్పకుండా సినిమాకు హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయి.
పెళ్లికి ముందు.. పెళ్లయ్యాక కెరీర్ లో ఏమైనా మార్పు కనిపిస్తుందా..?
పెళ్లి తరువాత ఓ హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో నాకు అర్థం కావడం లేదు. గతంలో పెళ్లి తరువాత హీరోయిన్స్ సినిమాలకు దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాకే హీరోయిన్లు మరింత బిజీగా ఉంటున్నారు. నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. అందుకే సినిమాలు చేస్తున్నా.. మా ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా నాక సపోర్ట్ చేస్తున్నారు.
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా..?
వైవిధ్యంగా ఉండే పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. కొత్త డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వాలి. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు సైన్ చేశా. వివరాలు త్వరలోనే చెబుతాను.