భరత్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో, ఎం. శక్తివేలు రచన, దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిరల్. ఈ చిత్రం తమిళం లో 2022 లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఇటీవల తెలుగులో ధియేటర్లలో విడుదల అయ్యింది. అయితే తెలుగులో బాక్సాఫీస్ వద్ద అంతగా వసూళ్లను రాబట్టలేదు. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా మరోసారి ఆడియెన్స్ ముందుకి రాబోతుంది.
తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వీడియోలో ఈ చిత్రం జూన్ 7, 2024 నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. ఇదే విషయాన్ని ఆహా వీడియో అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎన్. ప్రసాద్ సంగీతం అందించారు. డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.