నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికి చిత్రం వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. వారి రెండవ చిత్రం సరిపోదా శనివారం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ సింగిల్ ప్రోమో ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రోమో ఎలెక్ట్రి ఫెయింగ్ గా ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి పాట జూన్ 15 వ తేదీన ఉదయం 11:07 గంటలకు రిలీజ్ కానుంది.
ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూరుస్తున్నారు. సరిపోదా శనివారం చిత్రం ఆగస్ట్ 29, 2024న భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ కానుంది.
Here we go… #GaramGaram Promo ????
A goosebumps loaded bonanza awaits on June 15th at 11:07 AM ????#SaripodhaaSanivaaram#SuryasSaturday pic.twitter.com/NWNkqFZET5
— DVV Entertainment (@DVVMovies) June 13, 2024