“మిస్టర్ బచ్చన్” పాటలన్నీ చిత్రీకరించింది అక్కడే – హరీష్ శంకర్

టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో, మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ (Mr Bachchan). భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సాంగ్స్ షూటింగ్ కి సంబందించిన అప్డేట్ ను డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాల్ లేక్ వద్ద అన్ని పాటలు చిత్రీకరించినట్లు పేర్కొన్నారు.

ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Exit mobile version